కోరికలు కొనసాగె గోవిందరాజు మేరమీర ఇట్లానే మెరసితివా
బాలుడవై రేపల్లెలో బాలుదాగేవేళ యీలీలనే పవళించి యిరవైతివా
గోలవై తొట్టెలలోన గొల్లత లూచిపాడగా ఆలకించి విని పాట లవధరించితివా
కొంచక మధురలోన గుబ్జయింట నీలాగుల మంచాలపై బవళించి మరిగితివా
చంచుల ద్వారకలోన సత్యభామ తొడమీద ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా
పదియారువేలింతుల పాలిండ్లు తలగడలై పొదల నిటువలెనే భోగించితివా
యెదుట శ్రీ వేంకటేశ ఇట్టె తిరుపతిలోన నిదిరించక శ్రీభూమి నీళల్ గూడితివా
Download
No comments:
Post a Comment