శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 7, 2010

కోరుదు నామది

కోరుదు నామది ననిశము గుణధరు నిర్గుణు కృష్ణుని నారాయణు విశ్వంభరు నవనీతాహారుని

కుండలి మణిమయ భూషణు కువలదళ వర్ణాంగుని అణ్డజపతి వాహనుని అగణిత భవహరుని
మణ్డన చోదకదమనుని మాలాలంకృత వక్షుని నిండు కృపాంబుధి చంద్రుని నిత్యానందుని

ఆగమపుంజ పదార్థుని ఆపత్సఖ సంభూతుని నాగేంద్రాయుత తల్పుని నానా కల్పుని
చాగుబ్రహ్మ మయాఖ్యుని సంతతగాన విలోలుని వాగీశ సంస్తోత్రుని వైకుంఠోత్తముని

కుంకుమ వసంతకాముని గోపాంగన కుచలిప్తుని శంకర సతీమణి నుతుని సర్వాత్ముని సముని
శంఖ నినాద మృదంగుని చక్రాయుధ విదీప్తుని వేంకటగిరి నిజవాసుని విభవ విధాయకుని

No comments:

Post a Comment