శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 7, 2010

కౌసల్యానందన

కౌసల్యానందన రామకమలాప్తకుల రామ భాసురవరద జయ పూర్ణ రామ

మునుప దశరధరాముడవై తమ్ములు నీవు జనించి తాటక జంపి జన్నము గాచి
వెనుకొని హరువిల్లు విరిచి సీత బెండ్లాడి అనుమతి పరశురామునిచే గైకొంటివి

సుప్పనాతి శిక్శించి సొరిది రుశుల గాచి అప్పుడే ఖరదూశణాదుల గొట్టి
చొప్పుతో మాయామ్రుగము సోదించి హరియించి కప్పిహనుమంతు బంటుగానేలుకొంటివి

సొలసి వాలినడచి సుగ్రీవు గూడుక జలధి బంధించి లంకసాధించి
వెలయ రావణుగెల్చి విభీశణుని మన్నించి చెలగితివయోధ్యలో శ్రీవేంకటేశుడా

No comments:

Post a Comment