శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఒల్లడుగాక దేహి

ఒల్లడుగాక దేహి వుద్యోగించడుగాక కొల్లలైనమేలు తనగుణములో నున్నది

తలచుకొంటేజాలు దైవమేమి దవ్వా నిలుచుక తనలోనే నిండుకున్నాడు
చలపట్టితేజాలు సర్గ మేమి బాతా చలివేడినాలికపై సత్యములో నున్నాడు

ఆయమెఱిగితే జాలు నాయుష్యము గరవా కాయపుటూపిరిలోనే గని వున్నది
చేయబోతే పుణ్యుడుగా జీవునికి దడవా చేయుర గర్మము తనచేతిలోనే వున్నది

మొక్క నేరిచితే జాలు మోక్షమేమి లేదో యెక్కువశ్రీవేంకటేశుడిదె వున్నాడు
దక్కగొంటేజాలు పెద్దతనమేమి యరుదా తక్కక శాంతముతోడిదయ లోన నున్నది

No comments:

Post a Comment