శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఒరసి చూడబోతే

ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు పొరల మేను ధరించి పొరలగ బట్టెను

పాతకములటకొన్ని బలు పుణ్యాలట కొన్ని యీతల స్వర్గనరకాలిచ్చేనట
యేతుల నందుగొన్నాళ్ళు యిందు గొన్నాళ్ళు దేహికి పోతరించి కాతరించి పొరలనే పట్టెను

పొలతులట కోందరు పురుషులట కొందరు వెలుగును జీకట్లు విహారమట
కలవరింతలుగొంత ఘన సంసారము గొంత పొలసి జీవులు రెంటా బొరలగ బట్టెను

ఒక్కవంక జ్ఞానమట వొక్కవంక గర్మమట మొక్కి యిహపరాలకు మూలమిదట
తక్కక శ్రీ వేంకటేశు దాసులై గెలిచిరట పుక్కిట నిన్నాళ్ళు రెంటా బొరలగ బట్టెను

No comments:

Post a Comment