శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఒప్పులై నొప్పులై

ఒప్పులై నొప్పులై వుండుగాన అప్పటికి జూడ నదియేకా నిజము

కన్నుల కిన్నియు జూడ కలలై వలలై వున్నతాలు నడ్డాలై వుండుగాన
చిన్నచిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి వున్నవన్నియు జూడ నొకటేకా నిజము

సారెకు నోరికి జూడ చవులై నవ్వులై వూరటమాటలై వుండుగాన
తారుమారు తాకుసోకు తప్పుదోపులన్నియు వోరపారులేనివెల్ల నొక్కటేకా నిజము

మేనికి నిన్నియు జూడ మృదువై పొదువై పూని సంపదలై వుండుగాన
తేనై తీపై తిరువేంకటేశ నిన్ను కానవచినదే నొక్కటేకా నిజము

No comments:

Post a Comment