శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఒక్కడే ఏకాంగ

ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా యెక్కడా హనుమంతుని కెదురా లోకము

ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు యెందునా హనుమంతుని కెదురా లోకము

చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు ఎక్కువ హనుమంతుని కెదురా లోకము

జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి ఇల ఈ హనుమంతుని కెదురా లోకము

No comments:

Post a Comment