ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు తక్కినవి యిన్నియును తలపు రేచెడిని
యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు గుఱియై మాయలలోన గూడించే వింతె
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె
తెలుసుకో జీవుడా దేహమును నమ్మరాదు వలసితే నుండు బోవు వన్నెవంటిది
తలచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు పలులంపటములచే బరచెడి దింతె
సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే
No comments:
Post a Comment