ఓయమ్మా ఇంతయేల వొద్దనరే నాయముగాదిందరిలో నగుబాటు తనకును
చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని మక్కువతో నెంతైనా మాటాడడు
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు
ఇచ్చకము జేసితి ఇచ్చితి విడెమును కచ్చుపెట్టి యెంతైనా కరగడు
ముచ్చటలాడితిని మోవిజూచితి తన్ను బచ్చిగా జేసితినంటా పగచాటీ నితడు
కన్నులా జొక్కితిని కాగిటా నించితిని మన్నించె రతినెంతైనా మానడు
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని ఇన్నిటా శ్రీవేంకటేశు డెంతజాణే ఇతడు
No comments:
Post a Comment