ఓహో డేండేం వొగి బ్రహ్మ మిదియని సాహసమున శ్రుతి దాటెడిని
పరమున నరము బ్రకృతియు ననగా వెరవుదెలియుటే వివేకము
పరము దేవుడును అపరము జీవుడు తిరమైన ప్రకృతియె దేహము
జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును పూని తెలియుటే యోగము
జ్ఞానము దేహాత్మ జ్ఞేయము పరమాత్మ జ్ఞానగమ్యమే సాధించుమనసు
క్షరము నక్షరమును సాక్షి పురుషుడని సరవి దెలియుటే సాత్వికము
క్షరము ప్రపంచ మక్షరము కూటస్థుడు సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశుడు
No comments:
Post a Comment