గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె సిరులొసగీ చూడరో చింతామణి ఈపె
పాలజలధిపుట్టిన పద్మాలయ ఈపె లాలిత శ్రీనారసింహ లక్ష్మి ఈపె
మేలిమి లోకమాతయై మించిన మగువ ఈపె ఈలీలా లోకములేలే ఇందిర ఈపె
ఘనసంపదలొసగు కమలాకాంత ఈపె మనసిజుగనిన రమాపతి ఈపె
అనిశము పాయని మహాహరిప్రియ ఈపె ధనధాన్యరూపపు శ్రీతరుణి ఈపె
రచ్చల వెలసినట్టి రమావనిత ఈపె మచ్చికగల అలమేల్మంగ ఈపె
ఇచ్చట వేంకటాద్రి నీ అహోబలమునందు నిచ్చలూ తావుకొనిన నిధానము ఈపె
No comments:
Post a Comment