నే నేమిసేయుదును నీవు నాలోపలనుండి శ్రీనాథుడవు నీచేత ఇంతేకాక
తనువేమిసేయును తనువులోపలయున్న చెనటియింద్రియములచేతలుగాక
మనసేమిసేయును మనసులోపలనున్న నినుపుగోర్కులు చేసేనేరములుగాక
జీవుడేమిసేయును జీవునిబొదుగుకున్న భావపు ప్రకృతి చేసేపాపముగాక
చేవదేర బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి దైవపుమాయలోనిధర్మ మింతేకాక
కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశు డేలి మన్నించేమన్నన యిదియేకాక
యేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురు మేలిమి నిను దలచి మెచ్చుటేకాక
No comments:
Post a Comment