శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

నేరుపరి ననుకోను

నేరుపరి ననుకోను నెరజాణ ననుకోను యీరీతి నాహావ భావాలింతెఱగడా

మలసి తనతో నేను మాటలాడనని దూరి నెలవుల నవ్వితేనే సేన మాటలే
పిలిపించనని తాను బిగువులు నెరపీని తలుపు దెరచితేనే తగుసన్న గాదా

దగ్గర గూచుండనంటా తమకించి నంతలోనె సిగ్గువడి వుండితేనే చేరి వుండుటే
వొగ్గి తన్ను జూడనంటా వొరట్లు వట్టీని అగ్గమై యెదుట నుంటే అన్నియును గాదా

ముందు కౌగిలించనంటూ మొనలెల్ల జూపీని ఇందమని విడేమిచ్చుటదియే అది
అందపు శ్రీ వేంకటేశుడలమేలుమంగ నేను పొందితిమిద్దరమివి పోదులెల్లా గావా

No comments:

Post a Comment