శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

నేడు దప్పించుకొంటేను

నేడు దప్పించుకొంటేను నేరుపున్నదా పేడుక భోగించుతానే పెనగ జోటున్నదా

తనువు మోచిననాడే తప్పులెల్లా జేసితిని వెనక మంచితనాలు వెదక నేది
ననిచి సంసారినైననాడే నిష్టూరానకెల్ల మునుప నే గురియైతి మొరగ జోటున్నదా

సిరులు చేకొన్ననాడే సిలుగెల్లా గట్టుకొంటి తరగాతిపను లింక దడవనేల
నరలోకముచొచ్చిననాడే పుణ్యపాపముల పొరుగుకు వచ్చితిని బుద్దు లింక నేల

వూపిరిమోచిననాడే వొట్టికొంటి నాసలెల్లా మాపుదాకా వేసరిన మాన బొయ్యీనా
యేపున శ్రీవేంకటేశుడింతలో నన్ను గావగా పైపై గెలిచితిగాక పంతమాడగలనా

No comments:

Post a Comment