శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

నేనెంత చిన్ననైనా

నేనెంత చిన్ననైనా నీకే సులభము గాని పూని నా సరివారికి బొడవే సుమ్మీ

యిచ్చకపు పతివి నీవేమన్నా నితవే నాకు కొచ్చికొచ్చి తిట్టినాను కోపమున్నదా
తెచ్చుకొన్న నీసతులు తేనె మాటాడినాను మచ్చరములై పెరిగి మర్మములు నాటురా

నీటున బ్రాణవిభుడ నీవేమి సేసినా వాటమై మొక్కుదు గాక వాసి వట్టేనా
పాతకపు సవతులు నయగారాలు సేసినా యీటెల పోట్లే కాక యింతకోపేనా

చేరినిన్ను నేలినట్టి శ్రీ వేంకటేశ నీవు యేరీతి నుండినాను యెరవున్నదా
సారెకు నీవు ముట్టిన సవతులు వద్దనున్నా నీరసమె రేగు గాని యీయకోలు గాదురా

No comments:

Post a Comment