శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

నేనెంత నీవెంత

నేనెంత నీవెంత నిక్కె మా యిది కానీ లేరా యిది యొక్క కాకు నేనే జాడలా

కోరివేడి తగిలిన గోపసతు లుండ గాను అరయ నాకొంగు పట్టే వలసితినా
మేరతో బెండ్లాడిన రుక్మిణిదేవి వుండగాను యేరా నాతో నవ్వేవు యెగసక్కెమా

చనవిచ్చి మన్నించిన సత్యభామ వుండగాను చెనకేవు నే నీకు జిక్కితినా
పనివడి తెచ్చుకొన్న పదారువేలుండగాను నను జెక్కు నొక్కేవు నాటకములా

గందమిచ్చి మెప్పించిన కలికి యొకతె యుండ అంది నను గాగిలించే వాగడములా
కందున శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను చిందేవు మోహము నాపై చిత్తమింత వచ్చెనా

No comments:

Post a Comment