నెయ్యని పోసుకోరాదు నీళ్ళని చల్లగరాదు చెయ్యార గంటిమి నేడు చేరి నీతో పొందుట
ప్రేమము చాలాజేసి పెక్కు సతులతోను మోము చూడ సిగ్గుపడి ముసుగుతో నున్నదాన
జామువోయి వచ్చినీవు సరసములాడేవు యేమని నేనియ్యకుందు నేటిజన్మమయ్య
పలుమారు నీతోనవ్వి పరాకై వుండిన నీతో పలుకగ సిగ్గుపడి భావింపుచు నున్నదాన
కలగన్నట్లా వచ్చి కందువలంటేవు నన్ను బలిమి యేమున్నది నాబదుకు నీ చేతిది
మచ్చికతో నిన్నుగూడి మన్నించిన నీతోను పచ్చిసేయ సిగ్గుపడి వదరక వున్నదాన
యెచ్చుగా శ్రీ వేంకటేశ యిట్టెనన్ను నేలితివి విచ్చన విడాయ నా విభవము లెల్లను
No comments:
Post a Comment