శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

నేనే బ్రహ్మము

నేనే బ్రహ్మము కోనేరము నేము కామించిన స్వతంత్రము గడు లేదుగాన

క్షణములోపలనె సర్వజీవావస్థలూను గణుతించేవా డొకడు గలడు వేరే
అణుమహత్త్వములందు నంతర్యామైనవాని ప్రణుతించి దాసులమై బ్రదికేముగాని

పనిగొని యేలుటకు బ్రహ్మాదిదేవతల గనిపించేవా డోకడు గలడు వేరే
ననిచి సిరుల లక్ష్మీనాథుడైనవాని అనులవారము నేము బ్రదికేముగాని

సతతరక్షకుడయి శంఖచక్రధరుడయి గతి శ్రీవేంకటపతి గలడు వేరే
అతనిమఱగు చొచ్చి యానందపరవశాన బ్రతిలేక యిందరిలో బ్రదికేము గాని

No comments:

Post a Comment