ఎవ్వరికైనను యివ్రాత నను నవ్వులు సేసెబో నావ్రాత
తొలిజన్మంబున దోషకారియై నలుగడ దిప్పెను నావ్రాత
యిల దుర్గుణముల కీజన్మంబున నలకువ సేసెబో నావ్రాత
పురుషుని జేసల్పుని ననిపించుట నరజన్మమునకు నావ్రాత
తరుచయ్యినైపాతక మరుపెట్టుక నరకము చూపెబో నావ్రాత
పామఱితనమున బహువేదనలను నామ సెనసెబో నావ్రాత
కామితఫలు వేంకటపతిని గొలిచి నామతి దెలిపెబో నావ్రాత
No comments:
Post a Comment