ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో దవ్వు చేరువకు తానె గురుతు
పరమమంగళము భగవన్నామము సురలకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిగిన యెదుటనె వున్నది వరుసల మఱచినవారికి మాయ
వేదాంతసారము విష్ణుభక్తి యిది అదిమునులమత మయినది
సాదించువారికి సర్వసాధనము కాదని తొలగిన గడుశూన్యంబు
చేతినిదానము శ్రీవేంకటపతి యేతల జూచిన నిందరికి
నీతియు నిదియే నిజఏవకులకు పాఠకులకు నది భవసాగరము
No comments:
Post a Comment