శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఎవ్వరు లేరూ

ఎవ్వరు లేరూ హితవుచెప్పగ వట్టీ నొవ్వుల బడి నేము నొగిలేమయ్యా

అడవి బడినవాడు వెడల జోటులేక తొడరి కంపలకిందు దూరినట్లు
నడుమ దురిత కాననములతరి బడి వెడలలేక నేము విసిగేమయ్యా

తెవులువడినవాడు తినబోయి మధురము చవిగాక పులుసులు చవిగోరినట్లు
భవరోగముల బడి పరమామృతము నోర జవిగాక భవములు చవులాయనయ్యా

తనవారి విడిచి యితరమైనవారి వెనక దిరిగి తావెర్రైనట్లు
అనయము తిరువేంకటాధీశు గొల్వక మనసులోనివాని మరచేమయ్యా

No comments:

Post a Comment