ఎవ్వరివాడో యెఱుగరాదు అవ్వలివ్వలిజీవు డాటలో పతిమే
ధర జనించకతొలుత తను గానరాదు మరణమందినవెనుక మఱి కానరాదు
వురువడిదేహముతో నుందినయన్నాళ్ళే మరలుజీవునిబదుకు మాయవో చూడ
యిహములో భోగించు నిందు గొన్నాళ్ళు మహిమ పరలోకమున మలయు గొన్నాళ్ళు
తహతహల గర్మబంధముల దగిలినయపుడే అహహ దేహికి బడుచులాటవో బదుకు
సంతానరూపమై సాగు ముందరికి కొంత వెనకటిఫలము గుడువ దా దిరుగు
యింతటికి శ్రీవేంకటేశు డంతర్యామి అంతి నితనిగన్నబదుకువో బదుకు
No comments:
Post a Comment