శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఎప్పుడును

ఎప్పుడును గుట్టుతోడి యిల్లాండ్లము నేము వొప్పుగ సిగ్గు విడువనోజగాదు మాకును

మాట మాటలను నీకు మనసిచ్చి మెచ్చి యాపె కాటుక కన్నుల జూచి కరగించీని
తేటలు నేరుచునాపె తేలించనోపు నాపె యేటికి యవ్వరిపొందులేమి బాతి యికను

చేయివేసి చేయివేసి చెక్కునొక్కి చేత మొక్కి మాయపు నవ్వులు నవ్వి మరగించీని
చాయలకు వచ్చునాపె సరసములాడు నాపె ఆయనాయ వున్నసుద్దులాడ నేల యికను

వలపులు చల్లి చల్లి వాడికెగా నిన్ను గూడి వెలయించ నేర్చునాపె యిన్నిటా నాపె
అలరి శ్రీ వేంకటేశ అప్పటి నన్ను గూడితి తొలుతటి సద్దులేల దొమ్ములేల యికను

No comments:

Post a Comment