ఎవ్వరి గాదన్న నిది నిన్ను గాదంట యెవ్వరి గొలిచిన నిది నీకొలువు
అవయవములలో నది గాదిది గా దని మేలివి మేలన నేలా
భువియు బాతాళము దివియు నందలి జంతు నివహ మింతయునూ నీదేహమేకాన
నీవు లేనిచోటు నిజముగ దెలిపిన ఆవల నది గాదనవచ్చును
శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము భావింప నీవే పరిపూర్ణుడవుగాన
No comments:
Post a Comment