శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 17, 2010

భళి భళి రామ

భళి భళి రామ పంతపు రామ నీ బలిమి కెదురు లేరు భవహర రామ

విలువిద్య రామా వీర విక్రమ రామా తలకొన్న తాటకాంతక రామా
కొలయై బరుని తలగుండు గండ రామా చలమరి సమరపు జయజయ రామా

రవికుల రామా రావణాంతక రామా రవినుత ముఖ కపిరాజ రామా
సవరగా కొండలచే జలధి గట్టిన రామా జవ సత్త్వ సంపన్న జానకీ రామ

కౌసల్యా రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ
వేసాల పొరలే శ్రీవేంకటాద్రి రామ దాసులమము గావ తలకొన్న రామ


Download

No comments:

Post a Comment