శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 17, 2010

భక్తినీపై దొకటె

భక్తినీపై దొకటె పరమసుఖము యుక్తిజూచిన నిజం బొక్కటేలేదు

కులమెంత గలిగెనది కూడించు గర్వంబు చలమెంత గలిగెనది జగడమే రేచు
తలపెంత పెంచినా తగిలించు కోరికలు యెలమి విజ్ఞానంబు యేమిటాలేదు

ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు మొనయు చక్కదనంబు మోహములు రేచు
ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము యెనయగ పరమ పద మించుకయులేదు

తరుణులెందరు అయిన తాపములు సమకూడు సిరులెన్ని గలిగినను చింతలేపెరుగు
యిరవయిన శ్రీవేంకటేశు నినుకొలువగా పెరిగె నానందంబు బెళకులికలేవు

No comments:

Post a Comment