శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 17, 2010

భక్తికొలది వాడే

భక్తికొలది వాడే పరమాత్ముడు భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు

పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు బట్టబయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు

పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు బచ్చనవాసినరూపు పరమాత్ముడు
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడు

పలుకులలోనితేట పరమాత్ముడు ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు

No comments:

Post a Comment