భామనోచిన నోము ఫలము సఫలముగాను కామతాపంబునకు కాండవమునోమె
కొమ్మ చలిమందులకు గొంతిదామెర నోమె కమ్మదావులకు మును గౌరి నోమె
నెమ్మతిని కన్నీట నిండు గొలకులు నోమె ముమ్మడించిన వగల ముచ్చింత నోమె
చెదరు గందంబునకు చిట్టిబొట్టు నోమె కదియు పులకులకు మొలకుల నోము నోమె
ముదిత మాటాడకిదె మోనదాగెలు నోమె పొదలు చెమటలకు నినువుల నోము నోమె
నెలత మొగమునకు వెన్నెల మించులటు నోమె వెలయుగాంతికి వీధివెలుగు దా నోమె
ఎలమితోదిరు వేంకటేశుగూడి లలితాంగి నిచ్చకల్యాణంబు నోమె
No comments:
Post a Comment