శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 17, 2010

భూమిలోన

భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో నేమవుకృష్ణజయంతి నేడే యమ్మా

కావిరి బ్రహ్మాండము కడుపులోనున్న వాని దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని యీవల వసుదేవుడు యెట్టు గనెనమ్మా

పొడవుకు బొడవైన పురుషోత్తముడు నేడు అడరి తొట్టెలబాలుడాయ నమ్మ
వుడుగక యజ్ఞ భాగమొగి నారగించేవాడు కొడుకై తల్లిచన్నుగుడిచీనమ్మా

పాలజలధియల్లుండై పాయకుండేయీతనికి పాలవుట్లపండుగ బాతే యనటే
అలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి పేలరియై కడు పెచ్చువెరిగీనమ్మా

No comments:

Post a Comment