శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 17, 2010

భావమెరిగిన

భావమెరిగిన నల్లబల్లి చెన్నుడా నావద్దనే వుండుమీ నల్లబల్లి చెన్నుడా

వేసరక నీవు నాతో వేమారు జేసినట్టి బాసలు నమ్మితి నల్లబల్లి చెన్నుడా
వాసికి వన్నెకు నీకు వలచి చొక్కితి నేను నా సూటికే మన్నించు నల్లబల్లి చెన్నుడా

క్రియ గూడ నేను నీ కేలువట్టి పెండ్లాడితి బయలీదించకు నల్లబల్లి చెన్నుడా
ప్రియములు రెట్టింప బెనగితి నిందాకా నయములు చూపుమీ నల్లబల్లి చెన్నుడా

యెనసితి విటు నన్ను నియ్యకోలు సేసుకొని పనుపడె రతి నల్లబల్లి చెన్నుడా
ఘన శ్రీవేంకటాద్రిపై కందువ నేలుకొంటివి నను నిందరిలోపల నల్లబల్లి చెన్నుడా

No comments:

Post a Comment