శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, July 17, 2010

భావములోనా

భావములోనా బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా

హరి యవతారములే యఖిల దేవతలు హరి లోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి యనవో మనసా

విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా

అచ్యుతుడితడే ఆదియు నంత్యము అచ్యుతుడే యసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె అచ్యుత యచ్యుత శరణనవో మనసా


Download

No comments:

Post a Comment