భావమున బరబ్రహ్మమిదె కైవసమై మాకడ చూడన్
నీలమేఘ ముపనిషార్థం బదె పాలుదొంగిలెడి బాలులలో
చాలు నదియ మాజన్మరోగముల చీల దివియు మము జెలగించన్
తనియని వేదాంత రహస్యం బదె వొనర గోపికలవుట్లపై
పనుపడి సకలాపజ్జాలంబుల పనులు దీర్చ మము బాలించన్
భయములేని పెనుబరమపదం బదె జయమగు వేంకట శైలముపై
పయిపడు దురితపు బౌజుల నుక్కున లయముసేయు మము లాలింపన్
No comments:
Post a Comment