భోగిశయనమును బుసకొట్టెడిని యోగ నిద్ర పాయును మేల్కొనవే
కన్నులు దెరవక కమల బాంధవుడు వెన్నెల రేణువు వెలయ దిదే
అన్నువ మలసీ నరుణోదయమిదే మిన్నక నీవిటు మేలు కొనవే
తెల్లని కన్నులు దెరవక విరియగ నొల్లక జలజము లున్నవివే
కల్ల నిదుర నిను గవియగనియ్యక మెల్లనాయ నిటు మేలు కొనవే
తెరవగు రెప్పల దెల్లవారవలె తెరవక చీకటి దీరే దీదే
తెరగు వేంకటాధిప నీ వెరుగుదు మెరుగులు చల్లుచు మేలుకొనవే
No comments:
Post a Comment