చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు యీ రీతి శ్రీ వెంకటాద్రి నిరవైన దేవుడు
అలమేలుమంగ నురమందిడుకొన్న దేవుడు చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు
కల వరద హస్తము గటి హస్తపు దేవుడు మలసీ శ్రీ వత్స వనమాలికల దేవుడు
ఘన మకర కుండల కర్ణముల దేవుడు కనక పీతాంబర శృంగార దేవుడు
ననిచి బ్రహ్మాదుల నాభి గన్న దేవుడు జనించె బాదాల గంగ సంగతైన దేవుడు
కోటి మన్మథాకార సంకులమైన దేవుడు జూటపు గిరీటపు మించుల దేవుడు
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుడు యీటులేని శ్రీవేంకటేశుడైన దేవుడు
No comments:
Post a Comment