శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, June 10, 2010

చేరి యశోదకు

చేరి యశోదకు శిశు వితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు

సొలసి చూచినను సూర్యచంద్రులను లలి వెదచల్లెడులక్షణుడు
నిలిచిననిలువున నిఖిలదేవతల కలిగించు సురలగనివో యితడు

మాటలాడినను మరియజాండములు కోటులు వోడమేటిగుణరాశి
నీటగునూర్పుల నిఖిలవేదములు చాటువనూ రేటిసముద్ర మితడు

ముంగిట జొలసిన మోహన మాత్మల బొంగించేఘనపురుషుడు
సంగతి మావంటిశరణాగతులకు నంగము శ్రీవేంకటాధిపు డితడు


Download

No comments:

Post a Comment