శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, June 10, 2010

చేకొంటి నిహమే

చేకొంటి నిహమే చేరినపరమని కైకొని నీవిండు కలవేకాన

జగమున గలిగిన సకలభోగములు తగిన నీ ప్రసాదములే యివి
అగపడునేబదియక్షరపంజ్తులు నిగమగోచరపునీమంత్రములే

పొదిగొని సంసారపుత్రదార లిల వదలని నీదాసవర్గములే
చెదరక యేపొద్దు జేయునాపనులు కదిసిన నియ్యాగ్యాకైకర్యములే

నలుగడ మించిననాజన్మాదులు పలుమరు లిటు నీపంపు లివి
యెలమిని శ్రీవేంకటేశ్వర నీనిక వలసినప్పుడీ వరములు నాకు

No comments:

Post a Comment