చెల్లునంటా వచ్చివచ్చి చెట్టా పట్టేవు తొల్లియు నెందరి నిట్టే దొమ్ముల బెట్టితివో
ఆపరాని తమకాన నానచేసేగాక యింత మాపుదాణ నీ తోడి మాటలేలరా
దాపరాని మదన ముద్రలు మేననవే నీకు నేపుచు భ్రమల బెట్టి యెవ్వతె సేసినవో
ఉండలేక నీవద్దనే వుసురంటి గాక యింత బండు బండు సేసిన యీప్రాణమేలరా
వుండుగాగ జిత్తమెల్లా ఒక్కజేసితివి నా యండనుండే యెవ్వతెకు నమ్ముడు వోయితివో
తనివొక నిన్నింత దగ్గర నిచ్చితి గాక చనువున నిన్నుజేయి చాచనిత్తునా
ఘనుడు వేంకటరాయ కమ్మని యీవిరులు మునుప నెచ్చతో నీపైముడిచి వేసినవో
No comments:
Post a Comment