శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, June 10, 2010

చెల్లుగా కిట్టు

చెల్లుగా కిట్టు నీకే చింతింపగా పూరి పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు

చెలగి నే మునుసేసినచేత లుండగా మలసి నే తిరుగుతిమ్మట లుండగా
తొలగదోసి తుప్పుడుతోడనే లోహంబు వెలయ బంగారుగావించినగతిని

బిగిసి నామైనున్న పెనుకట్లుండగా జగడగాండ్లు పగచాటగను
జిగిగలచేతి ముసిడికాయయగు నన్ను మొగి గల్పకముఫలముగ జేయవసమా

పొదలిన యింద్రియంబులు వెంట రాగా మదవికారము నే మరుగగానే
వదలక వేంకటేశ్వర నన్ను నిదే నీ పదపంకజములు చేర్పగ నిది వసమా

No comments:

Post a Comment