చెలులారా చూడరే యీ చెలి భాగ్యము అలమేలుమంగ యీకె కబ్బెను యీ భాగ్యము
పతిదయ కలిగిన పడతిదీ భాగ్యము అతడు మాట మీరనీదది భాగ్యము
సతతముబాయక జంటై వుండేది భాగ్యము అతివలందరు గల్లా నది యేమి చెప్పరే
మగడు మన్నించిన మగువది భాగ్యము సొగసి యాతడు మోహించుట భాగ్యము
వెగటులేని రతుల వేసర నిది భాగ్యము మగువల వలపుల మరి యేమి భాగ్యము
శ్రీ వేంకటేశుడేలే మచ్చిక నీ సతిది భాగ్య మావేళ నాతడు మెచ్చినది భాగ్యము
తావుకొని యెప్పుడూ దనవాడౌటే భాగ్యము యేవనితల నేరుపులిక నేమి చెప్పరే
No comments:
Post a Comment