చేతులెత్తి మొక్కరమ్మ చేరి యారతెత్తరమ్మ యేతులే బూమెల్లా నిండె నీదేవునికి
తతిగొని పన్నీటిధారలు పై నించినించి సతముగా బెద్దలు మజ్జనమార్చగా
అతివలచనుగొండ లంగము లొత్తినందుకు యితవులై తోచె నేడు యిందిరాపతికి
కప్పురపుధూళి మేన గలయగ గంపెడేసి నెప్పున సందుసందుల నిగిడించగా
చొప్పులెత్తి గొల్లెతలచూపులు దాకినకుమ్మె లప్పుడన్నియును గప్పె నందువల్ల హరికి
తట్టుపుణు గలది యందపుటలమేలుమంగ నిట్టే వురముమీద నమరించగా
నెట్టన బచ్చి సేసిననెలతలచేతలలో చిట్టకములెల్లా గప్పె శ్రీవేంకటపతికి
No comments:
Post a Comment