దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు ఈవల నీబంట నాకు నెదురింక ఏది
కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీ బంటనట కమ్మినిన్ను దలచితి ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ
ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను మించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట
అంచల నీ బంటనట ఆత్మలొ నిను నమ్మితి వంచించ కడమయేది వసుధాధీశ
తగనొక్క చింతామణి తలచినట్లచేసు మిగుల కౌస్తుభమణి మించినా కృష్ణుడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను జగములో కొరతేది జగదేకవిభుడ
No comments:
Post a Comment