శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 14, 2010

దేవశిఖామణి

దేవశిఖామణి దివిజులు వొగడగ వేవేలు గతుల వెలసీ వాడే

వీధుల వీధుల వెసతురగముపై భేదిల బల్లెము బిరబిర దిప్పుచు
మోదము తోడుత మోహన మూరితి ఏ దెస జూచిన నేగీ వాడే

కన్నులు దిప్పుచు కర్ణములు కదల సన్నల రాగెకు చౌకళింపుచును
అన్నిటా తేజియాడగ దేవుడు తిన్నగ వాగేలు తిప్పీవాడే

వలగొని దిరుగుచు వాలము విసరుచు నిలిచి గుఱ్ఱమటు నేర్పులు చూపగ
బలు శ్రీ వేంకటపతి అహోబలపు పొలమున సారెకు పొదలీవాడే

No comments:

Post a Comment