దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా
ధర్మార్థకామ మోక్షతతులు నీ సోపానాలు అర్మిలి నాలుగువేదాలదె నీ దరులు
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు కూర్మము నీ లోతు వోకోనేరమ్మా
తగని గంగాది తీర్థమ్ములు నీకడళ్ళు జగతి దేవతలు నీ జల జంతును
గగనపు బుణ్యలోకాలు నీ దరిమేడలు మొగి నీచుట్టు మాకులు మునులోయమ్మా
వైకుంఠ నగరము వాకిలే నీ యాకారము చేకొను పుణ్యములే నీ జీవభావము
యేకడను శ్రీ వేంకటేశుడే నీ వునికి దీకొని నీ తీర్థమాడితిమి కావవమ్మా
No comments:
Post a Comment