శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 21, 2010

దైవము నీవే

దైవము నీవే యిక దరి చేరుతువుగాక జీవులవసము గాదు చిక్కిరి లోలోననే

పుట్టుట సహజ మిది పొదలేజీవులకెల్ల గట్టిగా జగమునందు కలకాలము
నట్టేటివరదవలె నానాటినీమాయ కొట్టుక పారగజొచ్చె కూడినవిజ్ఞానము

పాపమే సహజము బద్దసంసారులకెల్ల కాపురపువిధులలో కలకాలము
తేపలేనిసముద్రమురెరగున కర్మమెల్లా మాపురేపు ముంచజొచ్చె మతిలోనిధైర్యము

లంపటమే సహజము లలి దేహధారులకు గంపమోపు కోరికెలకలకాలము
యింపుల శ్రీవేంకటేశ ఇదె నీదాసులని పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి

No comments:

Post a Comment