శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, May 18, 2010

అల్లదె జవ్వని

అల్లదె జవ్వని హరి యురమున నదె మెల్లనె యిటు వుపమించరే మీరు

మత్తెపు జిప్పలో ముంచిన కలువలో వొత్తిలి కనుగవ లొక మాటాడరే
గుత్తపు గుండలో కొండలో కుచములో హత్తి యేర్పడగ ననరే మీరు

తామెర తూండ్లో తతియగు తీగెలో భామ చేతు లేర్పరచరే యిపుడు
దోమటి సింహమో తొడ గిన బయలో ఆమాటాడరే అందులో నొకటి

నీలపు మణులో నిండిన మేఘమో బలకి తురు మొక పలుకున జెప్పరే
యీ లీల శ్రీవేంకటేశ్వరు గూడెను మేలిమి మెఅగో మెలుతో యనరే

No comments:

Post a Comment