శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, May 18, 2010

అలుకలు చెల్లవు

అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలి నిందిర నీతో నవ్వినది

ఆదిలక్ష్మి మోహన కమలంబున వేద మాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును సాదరముగ గడు సాచినది

సిరి దన కన్నుల చింతామణులను పొరి నీపై దిగ బోసినది
వరద హస్తమున వలచెయి బట్టుక అరుదుగ నిను మాటాడించినది

జలధి కన్య తన సర్వాంగంబుల బిలిచి నిన్ను నిటు పెనగినది
అలముక శ్రీ వేంకటాధిప నిను రతి నెలమి నీ వురంబెక్కినది

No comments:

Post a Comment