అవునయ్య నీ సుద్దు లటు వంటివి జవళితో నంటు బచ్చలి వంటి వాడవు
చెలరేగి యేడ లేని చేతలెల్లా జేసివచ్చి వెలయు నిప్పుడు నన్ను వేడుకొనేవు
పలుమారు నీచేత బాసలు గొన వెరతు కలువ కంటుల యెడ కాత రీడ వనుచు
వాడ వారిపై నెల్లా వలపుల చల్లి వచ్చి యీడ నాతో నెడలేని యిచ్చలాడేవు
కోడె కాడ నీ వోజ కొనియాడ నిచ్చితయ్యీ జాడతో నింతుల యెడ చంచలుడ వనుచు
పెక్కు గోపికల నెల్లా బెండ్లాడి యిట వచ్చి గక్కన నా కౌగిట గలసితివి
నిక్కి శ్రీ వేంకటేశుడ నే నలమేల్మంగను కక్కసించ నోప నీవు గబ్బి వాడవనుచు
No comments:
Post a Comment