శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, May 18, 2010

అవియే పో నేడు

అవియే పో నేడు మాతోనంటి సేసే తపములు వివరించుకొని ఇట్టె విచ్చేయి మనవే

కొండల కొట్టగొనల గోరమైన తపములు పండు బలములలోని పచ్చిమేతలు
గుండె దాకే మంత్రాల కుత్తికలో జసములు దొండకారుణ్యాన నాడు తాజేసెగా

యేరులలో మునకలు యెఖ్ఖువ ఆచారాలు ఆ రీతి మోనము తోడి యానందాలు
కోరికోరి చలివేడి కోటికోటి నేమాలు చేరి యీ రీతి దపాలు సేసినాడుగా

సమ్మతించ జేసిన యాసన భేదబంధాలు వుమ్మడి యన్యోన్యపు యోగాలు
దొమ్మి శ్రీ వేంకటపతి తొల్లి సేసె నట్లనె రమ్మని నేడును నారతి జేసెగా

No comments:

Post a Comment