శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, May 18, 2010

అలర నుతించరో

అలర నుతించరో హరిని యెలయించి మిము భ్రమయించీనీ గాలము

సేయరో మనుజులారా చింత హరి నికనైన రోయరో మీ భుజియించు రుచుల మీద
కాయమస్థిరము యీకవి యధృవము చాల బోయబో యెందుకు గాకపోయ గాలము

మెచ్చరో మనుజులార మీరే హరికథలు పుచ్చరో మీ మదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరిక లెల్లను మీకు నిచ్చీని శుభములు యివి యెల్లకాలము

కనరో వేంకటపతి గన్నులు దనియగా వినరో యీతని స్తుతు వీనులు నిండ
మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు తనమీది మదిబుద్ది దాచీనీ గాలము

No comments:

Post a Comment