శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, May 17, 2010

అలర చంచలమైన

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల


Download

No comments:

Post a Comment